Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలయ్య గురించి భారీ మెసేజ్ పెట్టిన కృష్ణవంశీ

'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించడంతో బాలయ్యపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా రిలీజ్ కాకముందే... ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన ఫేస్ బుక్ పేజీలో ఏకంగా భారీ మెసేజ్ నే పోస్ట్ చేశాడు. "తెరమీదైనా, తెర వెనకైనా బాలయ్య అగ్నిపర్వతం లాంటి వాడు. ఎలాంటి క్యారెక్టర్ నైనా, ఎలాంటి సినిమానైనా చేయగల ఏకైక నటుడు. గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఎన్నో ఏళ్లుగా తెరపై ప్రకాశిస్తున్నాడు. 2000 ఏళ్ల తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాలను జయించడానికి గౌతమీపుత్ర శాతకర్ణి వస్తున్నాడు. ఉన్నత విలువలతో, ప్రమాణాలతో సినిమాను నిర్మించిన క్రిష్ కు, అతని టీమ్ కు అభినందనలు. ఈ అద్భుతమైన సినిమా ఘన విజయం సాధించాలి. సినీ పరిశ్రమ మొత్తానికి ఈ సినిమా ఒక మార్గదర్శిలా నిలవాలి", అంటూ కృష్ణవంశీ పోస్ట్ చేశాడు.


More Telugu News